కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో తెలంగాణపై నెలకు రూ.71 కోట్లకు పైగా భారం పడనుంది. రాష్ట్రంలో కోటి వరకు సిలిండర్లు వినియోగిస్తుండటంతో సామాన్యులపై రూ.50 కోట్ల భారం పడుతుంది. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.21.45 కోట్లు అదనంగా చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.905కు, నల్గొండలో రూ.927కు, విజయవాడలో రూ.875.50కి చేరింది. ఉజ్వల పథకం ధర కూడా పెరిగింది.