తెలంగాణ ప్రభుత్వం అనధికారిక లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ (LRS) గడువును 25 శాతం రాయితీతో జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు సోమవారం పురపాలక కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో గడువు పొడిగించారు. జూన్ 30 తర్వాత రాయితీ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.