ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు టీడీపీ కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ప్రముఖ సంస్థల ఛైర్మన్లు, ఎండీలతో సమావేశమవుతూ.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు.