మలేషియాలో ఊహించని విధంగా జరిగిన ఓ ప్రమాదంలో కుప్పం మహిళ గల్లంతయ్యారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ కౌలాలంపూర్‌లో పూసల వ్యాపారం చేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఫుట్‌పాత్ మీద నడిచి వెళ్తున్న సమయంలో ఫుట్‌పాత్ ఒక్కసారిగా లోనికి కుంగిపోయింది. దీంతో విజయలక్ష్మి పది అడుగుల లోతు ఉన్న డ్రైనేజీలో పడి గల్లంతయ్యారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు.