Teachers Washed Away in Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాగులో కొట్టుకుపోయి ఓ ప్రభుత్వ టీచర్ కన్నుమూసింది. మరో వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మన్యం జిల్లాలో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఏకలవ్య పాఠశాలకు చెందిన ఓ టీచర్, వార్డెన్‌తో కలిసి బైక్ మీద వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలోకి వెళ్లేసరికి ప్రవాహం పెరగటంతో గల్లంతై.. చనిపోయారు.