పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బంది పడ్డాడు. పవన్ కళ్యాణ్, చిరంజీవి వెంటనే సింగపూర్ వెళ్లి మార్క్ శంకర్ ను పరామర్శించారు. చికిత్స అనంతరం మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని.. ఆంజనేయ స్వామి దయతో త్వరలోనే కోలుకుంటాడని చిరంజీవి ఎక్స్ వేదికగా తెలిపారు.