Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పాతబస్తీలో నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా పలు కట్టడాలకు ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు. నగరంలో ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్‌ను పరిశీలించి.. ఆమోదం పొందిన తర్వాతే నిర్మాణాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది.