గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసు గురించి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. శ్రీవారి సిఫార్సు లెటర్లను అమ్ముకున్నానంటూ జరుగుతున్న ప్రచారంపైనా రియాక్టయ్యారు. తన తండ్రి ఐఏఎస్ అధికారి అని చెప్పిన భరత్.. బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకు శ్రీవారి పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం పట్టలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు మీద పోటీచేశాననే కోపంతోనే కక్షపూరితంగా కేసులు పెట్టినట్లు ఆరోపించారు. త్వరలోనే దీనిపై మరో మీడియా సమావేశం పడతానని చెప్పారు.