ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఉరట దక్కింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలైనందున ఆమె జైల్లో ఉండాల్సిన పని లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.