మంచువారి ఫ్యామిలీ ఫైట్ వ్యవహారంలో కీలక పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మెహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. డిసెంబర్ 10వ తారీఖున జరిగిన ఘర్షణలో మోహన్ బాబుకు గాయాలు కావటంతో.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఈరోజు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు.. మంచువారి ఫ్యామిలీ ఫైట్‌పై సీపీ సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.