ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు రూ.25 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల తరుఫున రూ.25 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి మోహన్ బాబు కుటుంబం విరాళంగా అందించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు విరాళం తాలూకు చెక్ అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకూ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.425 కోట్లు విరాళంగా సమకూరాయి.