సినిమా చెట్టుగా సినిమా రంగానికి, సినీ ప్రేక్షకులకు పరిచయమైన సినిమా చెట్టు కూలిపోయింది. వందల ఏళ్ల నాటి ఈ చెట్టు.. ఆదివారం రాత్రి నేలకు ఒరిగింది. 150 ఏళ్లల్లో 300 సినిమాలకు పైగా ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. అలా టాలీవుడ్‌లో ఓ భాగమైన ఈ మహావృక్షం కూలిపోవటంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరికి, ఈ ప్రాంతానికి పేరు తెచ్చిన ఈ మహావృక్షం ఇక లేదంటే.. తమ జీవితాల్లో ఏదో కోల్పోయామనే భావన కలుగుతోందని అభిప్రాయపడుతున్నారు.