Nagarjuna: రెండు రోజుల నుంచి హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ కట్టడమని పేర్కొంటూ.. హైడ్రా అధికారులు కూల్చి వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై, అక్కినేని నాగార్జునపై తీవ్ర విమర్శలు, వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అది పట్టా భూమి అని.. అక్రమ కట్టడం కాదు అంటూ నాగార్జున వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులను ఉద్దేశించి.. నాగార్జున ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ అందులో ఏముందంటే?