Nagarjuna: మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే నటీనటుల జీవితాలను ప్రత్యర్థులపై విమర్శించేందుకు వాడుకోవద్దని సూచించారు.