Chandrababu Reaction on Nandyal Roof collapse: నంద్యాల జిల్లా చిన్న వంగలి గ్రామంలో మిద్దె కూలి నలుగురు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోగా.. ప్రసన్న అనే బాలిక ఒంటరైంది. ఘటనపై స్పందించిన చంద్రబాబు.. బాలికను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాలికకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రసన్న సంరక్షణతో పాటుగా ఆమె చదువు బాధ్యతలను సైతం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక బాలిక నాన్నమ్మకు కూడా రూ.2 లక్షలు అందించాలని నంద్యాల కలెక్టర్‌ను ఆదేశించారు.