ఏపీ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను మంత్రి నారా లోకేష్ సన్మానించారు. షైనింగ్ స్టార్ట్స్ 2025 పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసిన నారా లోకేష్.. గవర్నమెంట్ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తన కుటుంబ కష్టాలను నారా లోకేష్ దృష్టికి తెచ్చింది. దీంతో చలించిపోయిన నారా లోకేష్.. ఆ విద్యార్థినికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నేనున్నా చెల్లెమ్మా, ఎక్కడ చదువుకుంటావో చదువుకో నీ ఇష్టం.. నేను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.