రాయలసీమవాసులకు, ముఖ్యంగా పేదల పాలిట వరంగా పేరొందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ నిధుల వినియోగానికి ఆర్డీటీకి కేంద్రం అనుమతులు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆర్డీటీ సేవల కొనసాగింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఆర్డీటీ సేవలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్.. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వంత చర్చిస్తున్నట్లు వెల్లడించారు.