ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఐఐఐటీలో సీటు సాధించి.. ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకోలేకపోతున్న ఓ విద్యార్థికి తాను ఉన్నానంటూ లోకేష్ అండగా నిలిచారు. ఆ విద్యార్థి చదవడానికి అయ్యే కోర్సు ఫీజును తాము చెల్లిస్తామంటూ ఐఐఐటీలో చదవాలన్న ఆ యవకుడి కలను సాకారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బసవయ్య అనే విద్యార్థికి చదువు విషయంలో ఈ ఇబ్బందులు రాగా.. నారా లోకేష్‌కు ట్వీట్ చేశారు. బసవయ్య ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన లోకేష్ అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.