Nara Lokesh sorry to complainant: మంత్రి నారా లోకేష్ ఓ వ్యక్తికి సారీ చెప్పారు. తన విభాగం తరుఫున క్షమాపణలు చెప్తున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రజాదర్బారులో ఓ సమస్యపై కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఫిర్యాదుచేశారు. అతని సమస్యను నమోదు చేసుకున్న అధికారులు రెండ్రోజుల్లోనే సమస్య పరిష్కారం అయ్యిందంటూ అతనికి మెసేజ్ పెట్టారు. అయితే తన సమస్య అలాగే ఉందని.. ఈ విషయాన్ని పరిశీలించాలంటూ ఆ వ్యక్తి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరించకుండా ఇలాంటి మెసేజ్‌లు పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అతని ట్వీట్‌కు స్పందించిన నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.