ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధమన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో మూడోరోజు నిర్వహించిన ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామన్నారు. అవినీతి లేకుండా ఇక్కడి ప్రజలకు పథకాలు అందజేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి కోసం తెచ్చిన జీవో రాష్ట్రమంతటా అమలుకు ఉపయోగపడిందని వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసే జెమ్స్ జ్యువెలరీ పార్క్ స్వర్ణకారుల దశ మార్చనుందన్నారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రి లోకేశ్ పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కొలనుకొండలో 231, పద్మశాలి బజార్ 127 కుటుంబాలకు పంపిణీ చేశారు. పెనుమాకలో 179, ఉండవల్లి 77, ఇప్పటంలో 10 కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు. నేడు మొత్తం 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటిపట్టాలు అందజేయనున్నారు.