Raj Bhavan Vijayawada: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైఎస్ షర్మిల, నారా లోకేష్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తనకు ఎదురుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మంత్రి నారా లోకేష్ ‘ఏం షర్మిలక్కా బాగున్నావా..’ అంటూ పలుకరించారు. దీంతో ఆమె కూడా కాసేపు మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.