శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి.. బైక్ చోరీలు మొదలెట్టాడు. తాళాలు వేసిన ద్విచక్రవాహనాలను కొట్టేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్లివచ్చాడు. అయితే తనపై నమోదైన కేసులను వాదించేందుకు కావలిలో ఓ న్యాయవాదిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇటీవల అతనితో మాట్లాడేందుకు వెళ్లిన దొంగ. లాయర్‌కు ఫీజు చెల్లించాడు. తిరిగి వెళ్లే సమయంలో డబ్బులు లేవని న్యాయవాది బైక్ చోరీ చేసి ఎత్తుకెళ్లాడు.