సైదాబాద్‌లోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న పురుషుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ట్రెండింగ్ ఫ్యాషన్స్’ తన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకునే ప్రయత్నంలో భాగంగా.. రూపాయి ధరకే దుస్తులను విక్రయించే ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడిన ఈ కార్యక్రమానికి ఉదయం భారీ సంఖ్యలో కొనుగోలుదారులు తరలివచ్చారు. ఒకరిని ఒకరు తోచుకుంటూ షాపులోకి దూసుకెళ్లారు. దీంతో షాపు నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.