ఓయూ పరిధిలోని పాత డిగ్రీ బ్యాచ్‌ల విద్యార్థులకు కీలక అవకాశం లభించింది. డిగ్రీ కోర్సుల్లో చేరి బ్యాక్‌లాగ్స్‌తో చదువు పూర్తి చేయలేకపోయిన వారికి వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షలను ఓయూ అధికారులు నిర్వహించనున్నారు. ప్రతి బ్యాక్‌లాగ్ పేపర్‌కు రూ.5 వేల చొప్పున పెనాల్టీ ఫీజుతో పాటు సాధారణ పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 28 వరకు అవకాశం కల్పించారు. ఈ పరీక్షలు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరగనున్నాయి.