పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో జరిగిన దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేషనల్ హైవే పక్కన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. పట్టపగలే ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు.. మండపంలోని సీసీ కెమెరాల మానిటర్ చోరీచేశారు. సీసీటీవీ కెమెరాల్లో ఇది రికార్డైంది. ఈ చోరీపై ఏప్రిల్ 15న ఆలయ అర్చకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.