పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ‘‘ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టాం. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబసభ్యులు చెప్పారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే. ఆయన హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి' అని వివరించారు.