తిరుమల లడ్డూ వ్యవహారంలో తమిళ హీరో కార్తిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. సపోర్ట్ చేస్తే చేయండి.. లేకపోతే సైలెంట్‌గా కూర్చోండి అంటూ కార్తి పేరు ఎత్తకుండానే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో కార్తి కూడా వెంటనే స్పందించి.. పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో హీరో కార్తి క్షమాపణలపై పవన్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కార్తి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే స్పందించినందుకు సంతోషమని ట్వీట్ చేశారు. సత్యం సుందరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.