పుంగనూరులో బాలిక తలపై ఉపాధ్యాయుడు కొట్టిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో బాలిక పుర్రె ఎముక చిట్లడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధకరమని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత తరహాలో కాకుండా విద్యార్థుల మానసిక ధోరణులను అర్థం చేసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ప్రస్తుతం ఆ బాలికను బెంగళూరు నుంచి ఇంటికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.