"మనం బలంగా ఉన్నప్పుడు చెడు చేయాలనుకునేవాడు కూడా చెడు చేయలేడు, కాబట్టి మూడ విశ్వాసాలను నమ్మకండి" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవు పలికారు. చేతబడి, చిల్లంగి వంటి మూఢనమ్మకాలను నమ్మకూడదని, ఏ పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.