Pawan Kalyan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘన విజయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీకి పవన్ శుభాకాంక్షలు చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టి.. ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువు అయిందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ప్రధాని మోదీ.. చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్నారని కొనియాడారు.