ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పాలనలో తనదైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు నిధులు కేటాయించారు పవన్ కళ్యాణ్. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు కేటాయించి పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనులపై చర్చించేందుకు ఏపీవ్యాప్తంగా ఒకేరోజు 13వేలకు పైగా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ స్థాయిలో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారిగా చెప్తున్నారు.