తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్.. దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా దీనిపై ప్రశ్నించగా.. పవన్ స్పందించారు. కోర్టు తమ ముందున్న సమాచారం ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసిందన్న పవన్.. కల్తీ జరగలేదని చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశం మీద ఇంత కంటే ఎక్కువ మాట్లాడకూడదని అన్నారు.