కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ చట్టాన్ని ఆమోదించాయని పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన పేర్ని నాని.. వక్ఫ్ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందడానికి టీడీపీ, జనసేనే కారణమని ఆరోపించారు. ఆ రెండు పార్టీలూ వ్యతిరేకించి ఉంటే వక్ఫ్ చట్టాన్ని కేంద్రం తెచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసంటూ అబద్ధపు ప్రచారం చేశారన్న పేర్ని నాని.. డాక్యుమెంట్లు బయట పెట్టడంతో సైలైంట్ అయ్యారన్నారు. ముస్లింల హక్కులు కాలరాయడం కరెక్ట్ కాదని అన్నారు. హిందూ ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నారని.. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారని ప్రశ్నించారు.