వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు జూన్ 26 నుంచి నెల్లూరు జైలులో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.