తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్ పూజా హెగ్డే దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందన్నారు పూజా హెగ్డే. ఎన్నో రోజుల నుంచి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నానని.. ఇవాళ తన కోరిక నెరవేరిందని.. స్వామి వారిని కనులారా చూసే మహద్భాగ్యం కలిగిందన్నారు. కుటుంబ సభ్యులతో ఆ దేవదేవుడిని దర్శించుకోవడం మరింత సంతోషంగా ఉందన్నారు. మే నెలలో తాను నటించిన రెట్రో సినిమా విడుదలవుతుందన్నారు.