సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను.. పీటీ వారెంట్ మీద విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల తర్వాత విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు పోసానికి మార్చి 20 వరకూ రిమాండ్ విధించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.