Prakasam Barrage Woman Rescued: ప్రకాశం బ్యారేజీలో దూకేసిన మహిళ.. కాపాడిన ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్

1 week ago 6
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణానదిలో దూకిన మహిళను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన 29 ఏళ్ల ఎం.దివ్యకు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఒక కుమార్తె సంతానం. భర్తతో మనస్పర్థలు రావడంతో కుమార్తెను ఆయన వద్దే వదిలి, కొంత కాలంగా విజయవాడలో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కుమార్తెను చూద్దామని దివ్య వెళ్లగా.. ఆ చిన్నారి ఆమె వద్దకు రాలేదు. దీంతో మనస్తాపం చెంది బుధవారం ప్రకాశం బ్యారేజి 67వ ఖానా వద్ద నదిలో దూకింది. అక్కడే ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది విషయం తెలుసుకొని వెంటనే స్పందించారు. బ్యారేజీ గేటు వద్ద నీటిలో తేలియాడుతున్న దివ్యకు తాడు సాయంతో ట్యూబ్‌ను పంపించారు. ఆ వెంటనే ఎ‌స్‌డీఆర్ఎఫ్ టీమ్ పడవలో అక్కడికి చేరుకున్నారు. ట్యూబ్‌ని పట్టుకొని నీటిలో తేలియాడుతున్న దివ్యను పడవలో ఒడ్డుకు చేర్చారు. బాధితురాలిని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Entire Article