వాళ్లిద్దరూ ఒకే రాష్ట్రానికి చెందినవాళ్లు. కానీ, ఉపాధి వెదుకుంటూ మరో రాష్ట్రానికి వచ్చారు. వారిలో యువకుడికి వివాహమైనా.. భార్యను సొంతూరులోనే ఉంచాడు. ఇదే అతడికి అవకాశంగా మారింది. తన రాష్ట్రానికి చెందిన యువతితో అయిన పరిచయాన్ని సహజీవనం వరకూ తీసుకెళ్లాడు. గత కొన్నాళ్లుగా ఒకే ఇంటిలో ఉంటున్న వీరి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఆమె గర్భం దాల్చడంతో పట్టించుకోవడం లేదని భావించింది. అంతేకాదు, సంపాదనను మొదటి భార్యకు పంపుతున్నాడని ఆరోపించింది.