తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య కౌంటర్లు, రివర్స్ కౌంటర్లు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయటం.. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. తన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని.. వచ్చాక స్పందిస్తానన్నారు. ఈలోపు వీలైతే తన ట్వీట్ మరోసారి చదవాలని సూచించారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్టుకు జనసేన శ్రేణులు కూడా ఇదే రీతిలో బదులిస్తున్నాయి.