సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 115 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్స్‌ను మూసివేయనున్నారు. స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పనుల కోసం రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 120 జతల రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లకు మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.