Railway Zone: విశాఖ రైల్వే జోన్. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి.. అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.