ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా బలపడింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో పలు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు తుపాను హెచ్చరికల కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది.