గత పది రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. భయటకు వెళ్లాలంటేనే భయపడే స్థితికి వచ్చింది. దీనికి తోడు వడగాలులు తోడవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది. రేపు, ఎల్లుండి . ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక వీటితో పాటు.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 21 నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వెల్లడించింది.