తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజనం తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. సంబంధిత అధికారులకు నాలుగు ప్రశ్నలు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. పుష్కరాల్లో భక్తులు చనిపోతే దేవుడిని అరెస్ట్ చేస్తారా అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు.