సినీ నటి రంభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రంభకు.. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట రంభను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు.