Reactor Blast: అచ్యుతాపురం సెజ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో మృతుల సంఖ్య 14 కు పెరిగింది. మరో 50 మంది ఈ ఘటనలో గాయాలపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రియాక్టర్ పేలడంతో.. కంపెనీ బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు.. సహాయక చర్యల కోసం ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. రేపు అక్కడ పర్యటించనున్నారు.