ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కలవబోతున్నారా.. గత నెలలో కలిసిన ఇద్దరు నేతలు మరోసారి హైదరాబాద్ వేదికగా ఒక్కచోట చేరబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్ వేదికగా ఆగస్ట్ 25వ తేదీన జరిగే శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జులై ఆరో తేదీన ఇద్దరు నేతలు కలిసి ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కలవడం ఇదే తొలిసారి కానుంది.