Revanth reddy: సర్వేలో వివరాలు అడిగితే ఎందుకు భయపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేతలు ఎందుకు వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. సర్వేలో భూ వివరాలు అడిగితే చాలా మంది ఇవ్వలేదని వెల్లడించారు. భూముల వివరాలు అడిగితే.. కేసీఆర్, కేటీఆర్‌కు భయమెందుకని నిలదీశారు.