CM Revanth Reddy meets union telecom minister: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలకు కేవలం రూ.300 లకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ - ఎడ్యుకేషన్ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర టెలికాం శాఖ మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే టీ- ఫైబర్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపిన రేవంత్ రెడ్డి.. టీ - ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ - 3 పథకంలో చేర్చుకోవాలని కోరారు.