Telangana Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలో పలు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. అయితే.. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో.. కలెక్టరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.